Lok Sabha Election 2019 : మోదీ కి తగలనున్న రైతన్నల పసుపు సెగ..! || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-23

Views 730

Farmers decided to contest from Varanasi Lok Sabha seat in the Lok Sabha polls. At this level, 50 farmers from Chalo Varanasi program under the leadership of the President of Divasigamani, Farmers said they are going to Varanasi from Arumur and Nizamabad Rural constituencies in Nizamabad district.
#nizamabad
#LokSabhaElection2019
#varanasi
#modi
#rahulgandhi
#wayanad
#farmers
#electioncommission

నిజామాబాద్ రైతుల పసుపు సెగ దేశ ప్రధాని మోదీ కి తగలబోతోంది. తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టు ఎన్నికల్లో వారు వ్యవహరించిన తీరు మర్చిపోకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ బరిలో నిలిచిన వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ మేరకు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు చలో వారణాసి కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలోని అర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్తున్నామని రైతులు చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులుగా వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్‌ వేస్తామన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS