IPL 2019:Match 47 of VIVO Indian Premier League (IPL 2019), Kolkata Knight Riders (KKR) snapped their six-match losing streak with a 34-run win over Mumbai Indians in a high-scoring IPL game that saw brutal play from power-hitters of both teams.
#IPL2019
#KolkataKnightRiders
#MumbaiIndians
#hardikpandya
#andrerussell
#rohithsharma
#dineshkarthik
#shubmangill
#cricket
ఐపీఎల్ 2019 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జూలు విదిల్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ (80 నాటౌట్: 40 బంతుల్లో 6x4, 8x6) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత 232 పరుగుల భారీ స్కోరు చేసిన కోల్‌కతా.. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్‌ని 198/7కే పరిమితం చేసి 34 పరుగుల తేడాతో గెలుపొందింది. మిడిల్ ఓవర్లలో ముంబయి పవర్ హిట్టర్ హార్దిక్ పాండ్య (91: 34 బంతుల్లో 6x4, 9x6) భారీ సిక్సర్లతో కాసేపు కంగారుపెట్టినా.. ఎట్టకేలకి అతడ్ని ఔట్ చేసిన కోల్‌కతా.. వరుసగా ఆరు మ్యాచ్‌ల తర్వాత మళ్లీ విజయాన్ని అందుకుంది. ఛేదనలో డికాక్ (0), రోహిత్ శర్మ (12), ఎవిన్ లావిస్ (15), సూర్యకుమార్ (15), కీరన్ పొలార్డ్ (20) తక్కువ స్కోరుకే ఔటైనా.. ఒంటరి పోరాటం చేసిన హార్దిక్ పాండ్య ముంబయి జట్టు పరువు నిలిపాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ముంబయి గెలిచింటే..? ప్లేఆఫ్ బెర్తు ఖాయమయ్యేది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ జట్లు ప్లేఆఫ్‌కి చేరిన విషయం తెలిసిందే.
అంతకముందు ఆండ్రీ రసెల్‌తో పాటు ఓపెనర్లు శుభమన్ గిల్ (76: 45 బంతుల్లో 6x4, 4x6), క్రిస్‌లిన్ (54: 29 బంతుల్లో 8x4, 2x6) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 2 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండటంతో.. కోల్‌కతా హిట్టర్లు ఆరంభం నుంచే బాదుడు మొదలెట్టేశారు. ఆఖర్లో రసెల్ దెబ్బకి ముంబయి అగ్రశ్రేణి బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా (0/44), లసిత్ మలింగ (0/48), హార్దిక్ పాండ్య (మూడు ఓవర్లలో 1/31) ధారాళంగా పరుగులిచ్చేశారు.