BJP MP GVL Narasimha Rao was comments on AP CM Chandrababu. Chandrababu will definitely defeat in this elections GVL said. Chandrababu trying to alligate Prime Minister Narendra Modi and KCR , GVL fired . everybody knows how was chandrababu win in 2014 elections. He Recalls that chandrababu won with EVM's without the paper trial in 2014, GVL commented.
#tdp
#chandrababu
#defeat
#evm
#kcr
#modi
#gvlnarasimharao
ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబుకు ఓటమి ఖాయమని చెప్పిన జీవీఎల్ ఓటమి భయంతోనే చంద్రబాబు నోరులేని ఈవీఎంలపై . ఈసీపై నేరం నెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రధాని మోడీపై, కేసీఆర్ పై బురద చల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు . ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడరాదని తాను 2010లో ఓ పుస్తకం రాసిన మాట వాస్తవమేనని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈవీఎంలకు వీవీప్యాట్ యంత్రాలను అనుసంధానం చేయలేదని తెలిపారు.ఈవీఎంల్లో మార్పు తీసుకురావాలని తాను బలంగా కోరుకున్నానని చెప్పారు. తమ పోరాటం కారణంగానే ఈవీఎంలకు వీవీప్యాట్ యంత్రాలను అనుసంధానించారని తెలిపారు. 'ఇప్పుడున్న ఈవీఎంలను 2014 వరకూ ఉన్న ఈవీఎంలతో పోల్చడం తప్పు. ఏపీలోని మూడు కోట్ల మంది ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తే తమ ఓటు ఏ పార్టీకి పడిందో వారంతా చూసుకోగలిగారని తెలిపారు జీవీఎల్ .