IPL 2019,Qualifier 2 : Chennai Super Kings Openers Faf Du Plessis, Shane Watson Run To The Same End

Oneindia Telugu 2019-05-11

Views 2

IPL 2019: Chennai Super Kings made it to their record eighth Indian Premier League (IPL) final when they defeated Delhi Capitals (DC) by six wickets in the second qualifier that was played in Visakhapatnam on Friday. Needing 148 to win, openers Faf du Plessis and Shane Watson were involved in a huge mix-up when they were stuck in the middle of the pitch only to witness the Delhi Capitals fielders miss running them out on both the ends.
#ipl2019
#cskvdc
#msdhoni
#qualifier2
#chennaisuperkings
#delhicapitals
#shanewatson
#rohitsharma

విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి విజయం సాధించింది. శుక్రవారం రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓ కామెడీ సన్నివేశం చోటుచేసుకుంది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్, షేన్ వాట్సన్ సమన్వయలోపం కారణంగా ఇద్దరూ ఒకే ఎండ్‌వైపు.. అదీ రెండు సార్లు పరుగెత్తారు. అయినప్పటికీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేయగా.. ఛేదనలో ఓపెనర్లు డుప్లెసిస్ (50: 39 బంతుల్లో 7x4, 1x6), షేన్ వాట్సన్ (50: 32 బంతుల్లో 3x4, 4x6) మెరుపు అర్ధశతకాలు బాదడంతో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. చెన్నై ఫైనల్‌కి చేరింది.

Share This Video


Download

  
Report form