ఇక బీజేపి టార్గెట్ తెలంగాణానే..! బలపడుతుందా..? భంగపడుతుందా..?

Oneindia Telugu 2019-06-01

Views 343

To strengthen in Telangana state is seen as a BJP strategy. There is also a plan to increase the cadre through local leaders. The BJP now has some cadre in 25 constituencies. The RSS and the ABVP are their strength.Strengthen the party and wait for the TRS to fight any anti-people policies.
#nationalpolitics
#nda
#telangana
#target
#modi
#unioncabinet
#amithshah
#kishanreddy
#modi

2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణ లో అనూహ్యంగా వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో జనం ప్రతిపక్ష పార్టీలను ఎంత గానో విశ్వసించారు. వాళ్లకు ఓటేసి నిలబెట్టారు. కాంగ్రెస్‌లో ముగ్గురికి, బీజేపీలో నలుగురికి పట్టం గట్టారు. 16 సీట్లు తమవే అనుకున్న టీఆర్‌ఎస్‌ను తొమ్మిదికి పరిమితం చేశారు.

మోడీ హవా, కొన్ని సెగ్మెంట్‌లలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉండడం వంటి కారణాలతో గెలిచిన బీజేపీలోనూ నాయకుల మధ్య కుమ్ములాటలున్నాయి. అయితే అవి బయటపడకపోయినా క్లోజ్‌గా చూసేవారికి బాగానే కనిపిస్తాయి. వాస్తవానికి తమకు ఒక్క సీటొస్తే ఎక్కువనుకుంది బీజేపీ. ఏకంగా నాలుగు గెలవడంతో ఆనందానికి హద్దుల్లేవు. మిగతా 13 చోట్లా సత్తా చాటింది. ఓటు శాతాన్ని గణనీయంగా 19.5 శాతానికి పెంచుకుంది. కేడర్‌ లేని చోట్లా ఉనికి చాటుకుంది. బీజేపీకి దక్కిన ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్‌ బలంగా లేని చోట్ల బీజేపీ గెలిచింది. అంటే ఓటరు పార్టీని చూడకుండా అపోజిషన్‌ను గెలిపించాలనే ఓటేశాడని అర్థం చేసుకోవచ్చు. మరి బీజేపీ కూడా ఓటరు ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ప్రవర్తిస్తుందా?సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్‌ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా పాపులారిటీ ఉంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS