"Sridevi's mother asked me to marry my daughter. That time Her mental condition is Not right, That's why she asked me like that." JD Chakravarthy said.
#jdchakravarthy
#sridevi
#tollywood
#boneykapoor
#ramgopalvarma
అతిలోక సుందరిగా ఇండియన్ సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి అప్పట్లో ఎంతో మందికి కలల రాణి. ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలా మంది ప్రముఖులు ట్రై చేశారు. కానీ ఎవరికీ దక్కలేదు, ఎవరూ ఊహించని విధంగా ఆమె బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను రెండో పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. తాజాగా నటుడు జేడీ చక్రవర్తి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఓ సంచలన విషయం బయట పెట్టారు. 'హిప్పీ' మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి తల్లి తన దగ్గరకు వచ్చి నా కూతురును పెళ్లి చేసుకోవాలని అడిగినట్లు వెల్లడించారు.