Bank ATM Alert! : ఇతర ATM లలో డబ్బు డ్రా చేస్తున్నారా.? ఐతే జాగ్రత్త..!! || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-21

Views 8

Money does not come with a debit card at any other ATM, except for the message that the money is cut. This makes account holders confused. Mobile Phone Messages comes from the ATM's without amount.Bank Official will give negligence answer towards Payments.
#telangana
#hyderabad
#nomoney
#confusion
#message
#ATM
#Bank

మీ బ్యాంక్ ఏటీఎం కు కాకుండా ఇతర బ్యాంక్ ఏటీఎంకి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్తున్నారా..? ఐతే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీ.. ఇతర ఏటీఎంలో డెబిట్ కార్డుతో డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు డబ్బులు కట్ ఐనట్టు మెస్సేజ్ మాత్రమే వస్తుంది తప్ప డబ్బులు మాత్రం రావు. దీంతో ఖాతాదారులు అయోమయానికి గురౌతున్నారు. ఏటీఎం సెంటర్లతో నగదు రాకుండా మొబైల్ ఫోన్ కి సందేశాలు రావడం.. బ్యాంకు ఖాతాలో నగదు మాయమవడం గురించి బ్యాంకుల్లో ఆరా తీస్తే అక్కడి అధికారులు ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మీ బ్యాంక్‌ ఖాతా ఎక్కడ ఉందో ఆ శాఖ నుంచి ఫిర్యాదు చేస్తే సమస్య గురించి పరిశీలిస్తామని సదరు ఏటీఎంలకు చెందిన బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. సొంత బ్యాంక్‌ శాఖకు వెళ్లి అడిగితే ఎక్కడైతే డబ్బు పోయిందో అక్కడ మొదట ఫిర్యాదు చేయాలని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS