Telangana is planning a program to provide free healing to all suffering from various diseases. There is talk that if the scheme can go directly to the people, the government will gain popularity.While cm Chandrasekhar Rao's idea, the adjustment of financial resources is going to be a puddle.
#telanganagovt
#cmkcr
#etelarajendar
#MedicalTreatment
#financialresources
గతంలో కంటి వెలుగు పథకం ద్వారా ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయింది, ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందించిన తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణలో అనేక వ్యాధులతో బాధపడుతున్న అందరికి ఉచిత వైద్యం అందించే దిశగా ఓ బృహత్కర కార్యక్రమానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ పథకం నేరుగా ప్రజల్లోకి వెళ్లగలిగితే ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు ఆలోచన ఉన్నతంగా ఉన్నప్పటికి ఆర్థిక వనరుల సర్దుబాటే గుదిబండగా మారనుంది. ఆర్థిక సమస్యలను అదిగమించి అదికారులు పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే మంచి ఫలితాలు రావడం ఖయమనే చర్చ తెలంగాణ ప్రజానికంలో జరుగుతోంది.