According to reports, the BCCI are unhappy with the way Sanjay Bangar dealt with India's middle order. The Men in Blue crashed out the Cricket World Cup after their semifinal defeat to New Zealand at Old Trafford.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavsnewzealand
#indvnz
#semifinal
#sanjaybangar
#bcci
#ravishastri
#vijayshanker
ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి బాధ్యుడిని వెదుకుతోంది ఘనత వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఈ ఒక్క వైఫల్యానికి బలి పశువు కోసం అన్వేషణ మొదలు పెట్టింది. బీసీసీఐ పెద్దల దృష్టి టీమిండియా మాజీ ఆటగాడు, సహాయ కోచ్ సంజయ్ బంగర్‌పై పడింది. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి సంజయ్ బంగర్‌ను తప్పించే దిశగా చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. భారత క్రికెట్ జట్టు స్వదేశానికి తిరిగి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.