ICC Cricket World Cup 2019 Final:Here is the English translation of the tweet: “You have Rs 2,000, I have Rs 2,000. You have one note of 2,000; I have four notes of 500. Who is richer? ICC: The one who has four notes of 500 is richer.”
#icccricketworldcup2019final
#engvnz
#kanewilliamson
#amitabhbachchan
#benstokes
#martinguptillrunout
#eoinmorgan
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో విజేతను ప్రకటించే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 'బౌండరీ రూల్'ను పాటించడంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్‌లో తనదైన శైలిలో స్పందించాడు.
ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఐసీసీ ఈ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవడంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం విస్మయం వ్యక్తం చేయగా తాజాగా ఆ జాబితాలో ఇప్పుడు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా చేరారు. ఐసీసీ బౌండరీ విధానంపై ట్విట్టర్‌లో తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.