Yuzvendra Chahal, India's frontline leg-spinner, celebrated his 29th birthday on Tuesday. Yuzvendra Chahal had an average World Cup 2019 as in the later part of the tournament he lost his touch and failed to provide India with breakthroughs in the middle overs.
#YuzvendraChahal
#RohitSharma
#shikhardhawan
#kuldeepyadav
#viratkohli
#cricket
ఈ రోజు టీమిండియా రిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ పుట్టినరోజు. చహల్ ఈ రోజుతో 29వ వసంతంలోకి అడుపెట్టాడు. ఈ సందర్భంగా చహల్ సన్నిహితులు, . టీమిండియా క్రికెటర్లు, అభిమానులు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లు తన ట్విట్టర్ ఖాతాలకు పని చెప్పారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు సైతం ఈ రోహిత్ ట్వీట్‌పై స్పందిస్తున్నారు.
'అత్యుత్తమ పుట్టినరోజు జరుపుకోవాలి గోట్' అంటూ రోహిత్ శర్మ వెరైటీగా చహల్‌కు విషెస్ తెలిపాడు. 'చిన్న తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు' అని మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ట్వీట్ చేసాడు. అంతేకాదు.. ఈసారి సమోసా ట్రీట్ ఇవ్వమని కోరాడు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు' అని సురేష్ రైనా ట్వీట్ చేసాడు. 'పరిమిత ఓవర్ల స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌కు 29వ పుట్టినరోజు శుభాకాంక్షలు' అని క్రికెట్ వరల్డ్ కప్ ట్వీట్ చేసింది.