AP Chief Minister Jaganmohan reddy going to delhi on Tuesday.Jagan will meet Prime Minister Narendra Modi and President Ramnath Kovind in a two-day visit to Delhi.
#YSJaganmohanReddy
#NarendraModi
#RamnathKovind
#nirmalasitharaman
#amitshah
#apspecialstatus
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఢిల్లి వేళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటించనున్న జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్‌తో సమావేశం కానున్నారు. సమావేశంలో బాగంగా ఏపి పునర్విభజనతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులపై చర్చించనున్నట్టు సమచారం. కాగా రెండు రోజుల రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం ఉదయం 9.30 గంటలకు తన నివాసం నుండి బయలు దేరి మధ్యహ్నాం ఢిల్లీకి చేరుకొనున్నారు. అనంతరం కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భేటి కానున్నారు. సాయంత్రం అయిదు గంటలకు ప్రధానమంత్రి మోడీతో సమావేశం కానున్నారు. ఇక మంగళవారం ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి బుధవారం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, 11.30 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన భేటీ కానున్నారు. అదే రోజు మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.