Bharatiya Janata Party Andhra Pradesh State President Kanna Lakshminarayana is thanked to Chief Minister of Andhra Pradesh YS Jaganmohan Reddy for positive response on his open letter. Kanna Lakshminarayana tweeted in this issue on Wednesday.
#bjp
#andhrapradesh
#kannalakshminarayana
#chiefminister
#ysjagan
#crda
కొన్నిరోజులుగా రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలోని రైతులకు కౌలు మొత్తాన్ని చెల్లించే విషయంలో జాప్యం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు రూపేణా జూన్ మొదటి వారంలో వారి ఖాతాల్లో నగదును జమ చేస్తూ వస్తోంది ప్రభుత్వం. జూన్ నుంచి కౌలు మొత్తం ఆగిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. కౌలు మొత్తాన్ని విడుదల చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలంటూ వారు వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలుసుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా- వారు ఇటీవలే కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు. కౌలు మొత్తాన్ని విడుదల చేసే అంశంపై కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.