U.S. President Donald Trump said on Friday the decision whether to order some residents of Florida to evacuate likely would be made on Sunday as the state braces for Hurricane Dorian.
#hurricane
#rains
#florida
#donaldtrump
#us
#Dorian
#Nasa
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హరికేన్ డోరియన్ అట్లాంటిక్ సముద్ర తీరం మీదుగా ఫ్లోరిడా వైపు దూసుకెళ్లింది. ఇక డోరియన్ తుఫాను ధాటికి ఫ్లోరిడాలో పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. డోరియన్ తుఫాన్ బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉండటంతో అక్కడికి వచ్చిన పర్యాటకులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది స్థానిక ప్రభుత్వం. డోరియన్ తుఫాను పెను బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుఫాను ధాటికి పలు పర్యాటక ప్రాంతాలు ధ్వంసం అవడమే కాకుండా... వాల్ట్ డిస్నీ వరల్డ్, నాసా లాంచ్ ప్యాడ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన పామ్ బీచ్‌లోని రిసార్ట్ కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది.