Ind vs WI 2nd Test, Highlights : India Complete Facile Win Over Windies For 2-0 Series Sweep

Oneindia Telugu 2019-09-03

Views 173

India registered yet another resounding win over West Indies in the 2nd Test on Monday to sweep the series 2-0 and consolidate their position at the top of the ICC World Test Championship points table. India had won the first Test by 318 runs in Antigua last week.
#IndiavsWestIndies2019
#indvwi2019
#indvwi1sttest
#jaspritbumrah
#ishanthsharma
#RavindraJadeja
#AjinkyaRahane
#cricket
#teamindia

వెస్టిండీస్ పర్యటనను టీమిండియా సంపూర్ణంగా ముగించింది. ముందు టీ20, తర్వాత వన్డే.. తాజాగా టెస్టు సిరీస్‌నూ క్లీన్ స్వీప్ చేసి పర్యటనను పరిపూర్ణం చేసేసింది. విండీస్‌కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మూడు సిరీస్‌ల్లోనూ దుమ్ముదులిపేసింది. కింగ్‌స్టన్‌లోని సబినా పార్క్ వేదికగా రెండో టెస్టులో వెస్టిండీస్‌పై టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో మరో ఘన విజయాన్ని సాధించింది. 468 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే చాప చుట్టేసింది. 45/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ప్రత్యర్థి జట్టు భారత బౌలర్ల ధాటికి దాసోహమైంది. జడేజా(3/58), షమి(3/65), ఇషాంత్ (2/37) బంతితో రెచ్చిపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన భారత్.. విండీస్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫాలోఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీసేన 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ టెస్టు సిరీస్ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీసేన 120 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS