Australia’s Steve Smith was impersonating their bespectacled former opening batsman Chris Rogers by donning glasses after winning the fourth test at Old Trafford and not mocking England spinner Jack Leach, coach Justin Langer said on Tuesday.
#justinlanger
#stevesmith
#jackleach
#twitter
#ashes2019
#australia
#england
#testcricket
#testseries
#Benstokes
నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన తర్వాత చేసుకున్న సంబరాల్లో స్టీవ్ స్మిత్ ఎగతాళి చేసింది జాక్ లీచ్‌ని కాదని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు. ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో నిలవడంతో పాటు యాషెస్ ట్రోఫీని సైతం తిరిగి సొంతం చేసుకుంది. నాలుగో టెస్టు విజయానంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైదానంలో పుష్ అప్స్ తీయడంతో పాటు డ్యాన్స్‌లు వేస్తూ కాస్త అతిగానే సంబరాలు చేసుకున్నారు.అయితే, ఈ సమయంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ లీచ్ తరహాలో స్మిత్ కళ్లద్దాలు పెట్టుకోగా ఆసీస్ ఆటగాళ్లు అతడిని ఔట్ చేస్తున్నట్లుగా నటించారు. దీంతో జాక్ లీచ్‌ను ఎగతాళి చేసినట్లు భావించిన ఇంగ్లాండ్ అభిమానులు స్మిత్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.