Balapur Laddu Auction Process Very Interesting. This time the laddu won by Kolan Ramreddy for 17 lakh 60 thousand rupees. Total 28 Members were participated in auction.
#balapur
#laddu
#auction
#balapurladdu
#hyderabad
#ganeshimmersion
#Kolanramreddy
#sabhithaindrareddy
ఎప్పటిలాగే ఈసారి కూడా బాలాపూర్ లడ్డు యాక్షన్ ఉత్కంఠభరితంగా సాగింది. 28 మంది పాల్గొన్న వేలం పాటలో చివరకు కొలన్ వంశీయులు లడ్డును దక్కించుకున్నారు. గతేడాది రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి 17 లక్షల 60 వేల రూపాయలు పలికింది. పోటాపోటీగా సాగిన వేలం పాటలో చివరకు కొలన్ రాంరెడ్డి బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డు వేలం పాట గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. ఏ ఏటికాయేడు లడ్డు అధిక ధర పలుకుతోంది. 1994లో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. బాలాపూర్ లడ్డూ వేలం పాట వీక్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈసారి కూడా చాలామంది వేలం పాట చూసేందుకు ఎగబడ్డారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.