Teacher Course Admissions Decreases In Telangana| గత ఐదేళ్లలో భారీగా తగ్గిన ఉపాధ్యాయ విద్య ప్రవేశాలు

Oneindia Telugu 2019-09-21

Views 114

Teacher course admissions in Telangana are in a fix. This year, five colleges registered zero admissions while admissions in 29 were in single digits. A total of 1.6 lakh seats remained vacant this academic year, and college managements anticipate this number will touch two lakhs,according to data available with the state Education Ministry.
#TeacherCourse
#B.Ed
#D.Ed
#Telangana
#govtschools
#colleges
#admissions
#EducationMinistry
#privateschools

రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులకు డిమాండ్‌ తగ్గిపోతోంది. విద్యారంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇచ్చేవేతనాలు చాలక ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. గతంలో టీచర్‌ కావాలన్న ఆశతో భారీ ఎత్తున ఉపా ధ్యాయ కోర్సులను అభ్యసించగా క్రమంగా డిప్లొమా ఇన్‌ ఎలి మెంటరీ ఎడ్యు కేషన్‌ (డీఎడ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెనుకాడుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. డీఎడ్‌లో గతంలో 11 వేలకుపైగా విద్యార్థులు చేరితే ఇప్పుడు ఆ సంఖ్య 5 వేలకు పడిపోయింది. అలాగే బీఎడ్‌లోనూ గతంలో 16 వేల మందికిపైగా విద్యార్థులు చేరితే వారి సంఖ్య 12 వేలకు తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరంలో పదుల సంఖ్యలో విద్యాసంస్థలు మూతపడ్డాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS