The YSR Congress Party government has claimed a big success of its reverse rendering concept and a saving of ₹628 crore to the exchequer in the Polavaram Project works. Megha Engineering and Infrastructure Limited (MEIL) has bagged these works quoting an amount that was 12.6 per cent less than the base price fixed by the government.
#PolavaramReverseTendering
#PolavaramProject
#MeghaEngineering
#apcmjagan
#chandrababu
#devineniuma
#anilkumaryadhav
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న రివర్స్ టెండరింగ్ విషయంలో తొలి అడుగు పడింది. పోలవరం ప్రాజెక్ట్ నుంచి దానిని ప్రారంభించారు.ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. విపక్షం మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతోంది. పైగా టెండరింగ్ విధానం లోపభూయిష్టంగా ఉందనే ఆరోపణలు చేస్తోంది.వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం సహా అనేక కీలక ప్రాజెక్టుల పనులన్నీ నిలిపివేశారు. గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని, వాటిపై విచారణ చేసిన తర్వాత మాత్రమే పనులు తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు.అందుకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం రూ. 2,500 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. దానిని సరిచేయడం కోసం రివర్స్ టెండరింగ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపింది.