The Delhi High Court disposed off the petition filed by Jana Sena member and environmentalist Pentapati Pulla Rao, alleging large-scale irregularities in Polavaram project, and has referred it to the Union Jal Shakti ministry. The court asked the ministry to treat it as a representation and told the petitioner to furnish the details available with him.
#polavaramreversetendering
#polavaramreversetenderingnotification
#polavaramprojectreversetenderingnotification
#DelhiHighCourt
#MinistryofJalShakti
#PentapatiPullaRao
#PolavaramIrrigationProject
#chandrababu
#apcmjagan
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలతో దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ప్రాజెక్టు మీద విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ పెంటపాటి పుల్లారావు అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పోలవరంపై విచారణ జరపాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించింది. పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిర్యాదుగా భావించాలని సూచించింది. పోలవరంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అమరావతిలో ప్రకటనలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో మాత్రం దానిపై ఎందుకు మాట్లాడడం లేదని పిటిషనర్ పెంటపాటి పుల్లారావు ప్రశ్నించారు. దీంతోపాటు మార్చిలో ఎన్నికల ప్రచారానికి గుంటూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్వయంగా పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారని అప్పటి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించిన విషయాన్ని పుల్లారావు హైలైట్ చేస్తున్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి ఆరోపణలు చేసినా కూడా ఇంతవరకు దానిపై విచారణ జరగలేదన్నారు.