తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ప్రగతి భవన్ ముట్టడి రోజు విధులు నిర్వర్తించిన ఎస్ఐ నవీన్ రెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారని రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 341, 322 తో పాటుగా 353 నాన్ బెయిలబుల్ సెక్షన్ క్రింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగాసోమవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక దాంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కీలక నాయకులను ఇళ్ల వద్దే హౌజ్ అరెస్ట్ చేయగా, మరికొందరిని పోలీసులు ప్రగతి భవన్ వద్ద అరెస్ట్ చేశారు.
#revanthreddy
#congressparty
#ponnamprabhakar
#jaggareddy
#bhattivikramarka
#Pragathibhavan
#kcr
#rtcsamme