Bangladesh PM Sheikh Hasina arrives in Kolkata to witness historic day-night Test match
భారత్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఇండియా-బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కోల్‌కతాకు చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆమె కోల్‌కతా విమానాశ్రయంకు చేరుకున్నారు. శుక్రవారం రోజున ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఇండియా బంగ్లాదేశ్ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ టెస్టుమ్యాచ్‌లో తొలిసారిగా పింక్ బాల్‌ను వినియోగిస్తున్నారు. ఏడేళ్ల క్రితమే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లకు ఐసీసీ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు భారత్ ఒక్క డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. ఆస్ట్రేలియాలో గతేడాది ఆడాల్సి ఉన్నప్పటికీ భారత్ ఇందుకు తిరస్కరించింది.