India vs Bangladesh,2nd Test : Former England skipper Michael Vaughan on Saturday appreciated Indian captain Virat Kohli after he smashed a century in the Pink Ball Test match against Bangladesh and described him as the 'best Batsman across all formats in this era'.
#indiavsbangladesh2019
#indvban2ndTesthighlights
#viratkohli
#rohitsharma
#pinkballtest
#umeshyadav
#ishanthsharma
#souravganguly
#MayankAgarwal
#ajyinkarahane
#mohammedshami
#deepakchahar
#yuzvendrachahal
#cricket
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ తరంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో "రెడ్ బాల్, వైట్ బాల్, ఇప్పుడు పింక్ బాల్. ఈ తరంలో అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ కోహ్లీనే" అని ట్వీట్ చేశాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చారిత్రాత్మక డే నైట్ టెస్టులో విరాట్ కోహ్లీ(136) టెస్టుల్లో 27వ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ 159 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 101 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా మొత్తంగా 70వ సెంచరీ.