TSRTC passes order to all bus depos on implementation of new Charges. RTC decided to collect minimum charge as rs 10. By today midnight new charges will be in effect.
#TSRTC
#TsrtcSamme
#TSRTCBusChargesHike
#TSRTCworkers
#cmkcr
#Ticketcharges
తెలంగాణ ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీని పైన ఇప్పటికే ప్రకటన చేసారు. ప్రతీ కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీకి అనుమతి ఇచ్చింది. దీంతో..అనేక రకాల కసరత్తు తరువాత పెంచిన ఛార్జీల వివరాలను తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ముఖ్యమంత్రి కిలో మీటర్ కు 20 పైసలు పెరుగుతుందని చెప్పినా..కనీస ఛార్జ్ రూ 10 గా ఆర్టీసీ నిర్ణయించింది. కొన్ని ప్రాంతాల్లో పెంచిన ధరల కారణంగా మినిమం టిక్కెట్ ధర రూ 8 గా ఉంటుందని...దీని కారణంగా చిల్లర సమస్య వస్తుందని అధికారులు వాదించారు. దీంతో..కనీస ఛార్జ్ ను రూ 10 గా అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక, అదే విధంగా బస్సులు..ప్రయాణ దూరం ఆధారంగా ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగిన ఛార్జీలు ఈ అర్ద్రరాత్రి నుండి అమల్లోకి రానున్నాయి