Disha Issue : YCP Mp Sleeping In Lokasabha At The Time Of Dicussion || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-03

Views 4.7K

YCP Mp Gorantla Mahdava epresenting Hindupuram constituency sleeping i lokasabha at the time of Disha issue dicussion is became viral topic in political circles.
#DishaIssue
#APCMJagan
#Lokasabha
#GorantlaMahdava
#politicalcircles


దేశం మొత్తం దిశ ఘటన పైన నిరసనలతో హోరెత్తుతోంది. పార్లమెంట్ లోనూ ఇదే అంశం పైన అట్టుడుకుతోంది. లోక్ సభలో దిశ అంశం పైన చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో..ఒక ఎంపీ సభలోనే ఆ చర్చ ఒక జోలపాటలా భావిస్తూ ప్రశాంతంగా కునుకు తీస్తున్నారు. ఇది పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్షంగా తిలకిస్తున్న ప్రతీ ఒక్కరి కంట పడింది. అదే చర్చలో ఏపీ అధికార పార్టీకి చెందిన ఎంపీలు సైతం పాల్గొన్నారు. బాధితురాలి పక్షాన తమ గళం వినిపించారు. తమను తాముగా బతకనివ్వడంటంటూ అదే పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఆక్రోశించారు. కానీ, ఆ ఎంపీ మాత్రం ప్రశాంతంగా తన సీట్లో కూర్చొని హాయిగా నిద్ర పోతున్నారు. ఇది ఇప్పుడు ఢిల్లీలోనే కాదు..ఏపీ అధికార పార్టీలోనూ హాట్ టాపిక్ గా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS