షాద్ నగర్ చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చర్యను వేలాది మంది ప్రశంసిస్తుండగా, కొందరు ప్రముఖులు ఈ చర్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య తప్పంటున్నారు. వెటర్నరీ డాక్టర్ దిశను హైదరాబాద్ శివార్లలో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దారుణంగా హతమార్చిన ఘటనలో కేవలం 10 రోజులలో ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు . ఎన్ కౌంటర్ పై దిశ తల్లిదండ్రులతో పాటు, నిర్భయ తల్లి, బాలీవుడ్, టాలీవుడ్ నటీ నటులు హర్షం వ్యక్తం చేశారు. దిశా తల్లిదండ్రులు , అలా గే సోదరి కూడా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
#DishaIssue
#cpsajjanar
#TelanganaPolice
#HRC
#HumanRightsCommission
#ktr
#cmkcr
#Dishacase
#cpsajjanarpressmeet
#telangana