Team India head coach Ravi Shastri has lauded Virat Kohli, saying that the Indian captain is improving with each passing day as a skipper. Shastri also added that the passion and energy with which Kohli plays the game is unmatched.
#ViratKohli
#RaviShastri
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#klrahul
#shikhardhawan
#rishabpanth
#cricket
#teamindia
క్రికెట్ పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న అభిరుచి, శక్తికి మరొకరు సాటి రాలేరని హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ప్రతిరోజు తనను తాను కోహ్లీ ఎంతగానో మెరుగుపరచుకుంటూనే ఉన్నాడని తెలిపాడు. తన ఆట తీరుతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడని కోహ్లీపై రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.
తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ "కోహ్లీ ప్రతిరోజూ మెరుగవుతున్నాడు. ఆట పట్ల అతడికి ఉన్న అభిరుచి, శక్తికి మరొకరు సాటి రాలేరు. అలాంటి కెప్టెన్‌ను కూడా ఇంతకు మునుపెన్నడూ నేను చూడలేదు. వ్యూహాత్మకంగా అతడు ఎదుగుతున్నాడు. అనుభవంతో మరింత మెరుగవుతాడు. ప్రతి ఒక్కరికి బలం, బలహీనత ఉంటాయి" అని అన్నాడు.
"నిజానికి కొంతమంది కెప్టెన్లకు ఒక విభాగంలో బలముంటే మిగతా విభాగాల్లో అంత పట్టు ఉండకపోవచ్చు. కానీ, కోహ్లీ మాత్రం అందుకు భిన్నం. విభిన్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు. అతడు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకుపోతున్న విధానం అద్భుతం" అని కోహ్లీపై రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.
"టెస్టు క్రికెట్‌కు ప్రచారం కల్పించేందుకు కోహ్లీ కంటే మెరుగైన వారు మరొకరు లేరు