JNU Issue | ABVP vs JNUSU: ప్రతి ఇనుప రాడ్డుకు ‘డిబేట్’తో జవాబిస్తాం!! - ఐషే ఘోష్ | Oneindia Telugu

Oneindia Telugu 2020-01-07

Views 252

Jawaharlal Nehru University Student Union (JNUSU) president Aishe Ghosh on evening of Jan 05, demanded the immediate removal of Vice Chancellor.
#JNUIssue
#ABVP
#JNUSU
#SatishChandra
#AisheGhosh
#జేఎన్‌యూఎస్‌యూ
#JNUSUpresident
#JawaharlalNehruUniversity

ఆదివారం రాత్రి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో కొందరు వ్యక్తులు తమపై పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే వసతి గృహాల్లోకి వచ్చి విద్యార్థులను బయటకు లాగి కర్రలు, రాడ్లతో దాడులు చేశారని చెప్పారు. ఈ దాడిలు ఐషే ఘోష్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. సోమవారం ఆమె దాడి ఘటనపై మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై దాడి జరుగుతున్నా జేఎన్‌యూ భద్రతా సిబ్బంది అడ్డుకోవడానికి ముందుకు రాలేదని ఘోష్ తెలిపారు. తాము చేస్తున్న ఆందోళనలకు విఘాతం కల్పించేందుకు గత నాలుగు రోజులుగా ఆర్ఎస్ఎస్‌కు చెందిన కొందరు ప్రొఫెసర్లు హింసను ప్రేరేపించారని ఆమె ఆరోపించారు.
విద్యార్థులపై ఉపయోగించిన ప్రతి ఇనుప రాడ్డుకు డిబేట్(చర్చల) ద్వారా సమాధానమిస్తామని అన్నారు.


Share This Video


Download

  
Report form