Wings India 2020, an international exhibition and conference on civil aviation sector, will be held at Begumpet Airport in Hyderabad from March 12 to 15. At a curtain raiser event here, Union Civil Aviation Minister Hardeep Singh Puri sought active participation from the stakeholders for the same.
#wingsindia2020
#ktr
#telangana
#hardeepsinghpuri
#unioncivilaviationminister
ఢిల్లీలో విమానయాన శాఖ గురువారం సాయంత్రం నిర్వహించిన ‘వింగ్స్ ఇండియా 2020'పై సన్నాహాక సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. కేంద్రమంత్రి హార్దీప్ సింగ్ పూరీతోపాటు దేశ, విదేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని అన్నారు. రాష్ట్రంోలని 6 ద్వితీయ శ్రేణి నగరాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. వరంగల్, ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విమాన, రక్షణ రంగానికి చెందిన ప్రసిద్ధ సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో తమ శాఖలను ఏర్పాటు చేశాయని చెప్పారు.