#SheInspiresUs: AP Woman Padala Bhudevi Received "Nari Shakti Puraskar"

Oneindia Telugu 2020-03-09

Views 4

AP woman Padala Bhudevi receives Nari Shakti Puraskar from president. Padala Bhudevi, who received the "Nari Shakti Puraskar" from President Ram Nath Kovind on the International Women's Day, is working for women empowerment among tribals in the north coastal region of Andhra Pradesh, Srikakulam district.
#SheInspiresUs
#InternationalWomensDay
#NariShaktiPuraskar
#PadalaBhudevi
#womenempowerment
#tribals
#ChinnayaAdhivasiVikasSociety
#AndhraPradesh
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే నారీశక్తి పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలను కేంద్ర ప్రభుత్వం నారీశక్తి పురస్కారంతో సత్కరించింది. 2019 సంవత్సరానికి గానూ పలువురు మహిళలకు నారీశక్తి పురస్కారాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందజేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంకు చెందిన పడాల భూదేవి నారీశక్తి పురస్కారం అందుకున్నారు. 1996లో తన తండ్రి స్థాపించిన ఆదివాసి వికాస్ సొసైటీ ద్వారా గిరిజన మహిళలు, వితంతువులు, పోడు భూముల అభివృద్ధికి చేస్తున్న కృషికి గానూ భూదేవి ఈ పురస్కారం అందుకున్నారు

Share This Video


Download

  
Report form