The congregation at Deoband in the State UP took place simultaneously with that of Nizamuddin in Delhi. On Sunday, two out of three returnees of Deoband reported positive for COVID-19 in Nirmal district.
#Coronavirus
#updeobandmosque
#Deobandreturnees
#NizamuddinMarkaz
#lockdownextension
కరోనా కేసుల్లో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. నిజాముద్దీన్ మర్కజ్ తరహాలో ఉత్తరప్రదేశ్‌లోని దియో బంద్‌కి వెళ్లి వచ్చిన ఇద్దరు నిర్మల్ జిల్లా వాసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు స్థానిక అధికారులు,పోలీసులు అప్రమత్తమై వీరిని గుర్తించినట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఇంటలిజెన్స్ అధికారులు వీరి వివరాలను గుర్తించినట్టు సమాచారం.ఇంటలిజెన్స్ సమాచారంతో జిల్లా అధికారులు ఆ ఇద్దరిని ఆదివారం (ఏప్రిల్ 12) ప్రభుత్వాసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో జిల్లాలో దియోబంద్‌కి వెళ్లివచ్చినవారు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే తాజాగా పాజిటివ్‌గా తేలిన ఇద్దరి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను కూడా గుర్తించి క్వారెంటైన్ చేసినట్టు తెలుస్తోంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.