Ambavuneeve - Kanakesh Rathod

Bijibilla Rama Rao 2020-05-09

Views 6

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : AMBAVU NEEVE

శ్లోకం : నమస్తే, శుద్ధ సేవ్యాని, ఆర్యే, మందార వాసినీ కుమారీ, కామినీ, కపాలీ
కపిలే, కృష్ణ పింగళే భద్రకాళీ, నమస్తుభ్యం, కోటదుర్గా, "నమోస్తుతే"

పల్లవి : అంబవు నీవె, జగదంబవు నీవె జగములనేలే, జననివి నీవే
అంబా, శరణం, జగదంబా! "2"

చరణం : భరతాది మునివరులు, నిను బూజింపగ ఆనంద మనముల వచ్చిరి తల్లీ!
జలజాక్షి! నీ, మహిమ వర్ణింప తరమా! నీవే, మాతల్లి, దాక్షాయణీ!
నవ మల్లెలు, చంప, కలువలు, సంపెంగ పూలు తెచ్చి నిన్ను, బూజింతు, ముదమార,
మణి ద్వీపమునందు, కొలువుండు మాతల్లి! వరము లీయగ రావె! శ్రీ చక్రవాసినీ
అంబా, శరణం, జగదంబా , "2"

చరణం : వినినంత, నీ పాద మంజీర నాదములు దనుజుల గుండెల ఘీంకార ధ్వనులు
నవదుర్గవై నీవు, అసుర సంహారము జేసి, లోకములు పాలింతువే, తల్లీ
సద్గుణముల రాశి, శివవామ భాగమున నెలవుండినావు, శివరమణివై నీవు
నీ సేవయె మాకు, సౌభాగ్యమే తల్లీ! అభీష్టసిద్ధివి, మా కల్పవల్లివి
అంబా, శరణం, జగదంబా "అంబవు" "2"

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS