జెమోపాయ్ మిసో మినీ ఎలక్ట్రిక్ స్కూటర్

DriveSpark Telugu 2020-06-30

Views 75

తెలంగాణకు చెందిన జెమోపాయ్ ఎలక్ట్రిక్ దేశంలోని మొట్టమొదటి సోషల్ డిస్టెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ జెమోపాయ్ మిసోను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 44,000. ఈ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు కంపెనీ తెలిపింది.

మిసో మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ దిగుమతి చేసుకున్న బ్యాటరీ సెల్స్ మినహా ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి. ఈ మినీ స్కూటర్ ఒకే ఛార్జ్ తో 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. మినీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 48 వి, 1 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ, హెక్సా హెడ్‌లైట్ మరియు ఎల్‌ఇడి బ్యాటరీ ఇండికేటర్ ఉన్నాయి. జెమోపాయ్ మిసో, ఓనర్స్ కోసం మూడేళ్ల ఫ్రీ సర్వీస్ ప్యాకేజీని కూడా అందిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS