IPL 2020 : Kolkata Knight Riders team analysis and play offs prediction.
#Kkr
#Kolkataknightriders
#Ipl2020
#Ipl2020updates
కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఐపీఎల్‌లోనే బలమైన జట్టు. ప్రతి సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే వాటిల్లో కచ్చితంగా ఉండే టీమ్. 2012, 14 సీజన్లలో చాంపియన్‌గా నిలిచిన జట్టు. కానీ గత సీజన్‌లో ఐదో స్థానానికే పరిమితమైన కేకేఆర్.. ఈసారి భారీ ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నది. ముచ్చటగా మూడో టైటిల్‌ను ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2008లో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌ను ఎక్కడికో తీసుకెళ్లిన బ్రెండన్ మెకల్లమ్ హెడ్ కోచ్‌గా తన పనితనాన్ని చూపెట్టబోతున్నాడు. ఇప్పటికే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో కేకేఆర్ ఫ్రాంచైజీకే చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన మెకల్లమ్.. ఐపీఎల్ టైటిల్ కూడా అందించాలని ప్రణాళికలు రచిస్తున్నాడు.