దేశంలోని 10 కొత్త నగరాల్లో విడుదల కానున్న ఎమ్‌జి జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్

DriveSpark Telugu 2020-09-28

Views 33

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ, ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో తమ "ఎమ్‌జి జెడ్‌ఎస్" ఎలక్ట్రిక్ కారును దేశవ్యాప్తంగా 10 కొత్త నగరాల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎమ్‌జి మోటార్స్ తమ సోషల్ మీడియా ఛానెళ్లలో ఓ టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది.

ఎమ్‌జి జెడ్‌ఎస్ ఈవి ఎలక్ట్రిక్-ఎస్‌యూవీని భారత్‌లోని 10 కొత్త నగరాల్లో విడుదల చేయనున్నారు. ఇందులో కోల్‌కతా, లక్నో, లుధియానా, కోయంబత్తూర్, డెహ్రాడూన్, నాగ్‌పూర్, ఆగ్రా, ఔరంగాబాద్, ఇండోర్, మరియు విశాఖపట్నం నగరాలు ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS