వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త మహీంద్రా థార్ ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టింది. దీని ధర రూ. 9.80 లక్షలు. మహీంద్రా థార్ రెండు ట్రిమ్స్ వేరియంట్లలో పరిచయం చేయబడింది. అవి ఎఎక్స్ మరియు ఎల్ఎక్స్ వేరియంట్లు. 2020 మహీంద్రా థార్ కొత్త ఫీచర్స్ మరియు మంచి డిజైన్ కలిగి ఉంటుంది.
2020 మహీంద్రా థార్ టాప్ వేరియంట్ ధర రూ. 12 .95 లక్షలు. దేశవ్యాప్తంగా కంపెనీ డీలర్‌షిప్‌లు మరియు ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా దీని బుకింగ్ ప్రారంభించబడింది. థార్ యొక్క మొదటి యూనిట్ వేలంలో గెలిచిన వ్యక్తికి అప్పగించబడింది. సాధారణ వినియోగదారులకు డెలివరీ నవంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది.