Prime Minister Narendra Modi attended G20 Saudi Arabia 2020 Riyadh Summit on Nov 21. King Salman bin Abdulaziz Al Saud addressed the Summit. The summit aims to discuss financial and socioeconomic issues.
#G20RiyadhSummit
#NarendraModi
#G20Summit
#SaudiArabia
#SalmanbinAbdulazizAlSaud
#coronavirusVaccine
#China
#G20SaudiArabia2020RiyadhSummit
ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా, ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటా కలిగిన దేశాధినేతల వార్షిక సమావేశమైన ‘జీ20 సదస్సు 2020'లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ ఏడాది సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇస్తుండగా, ఆ దేశ పాలకుల ఆహ్వానం మేరకు మోదీ శనివారం రాత్రి వర్చువల్ విధానంలో సదస్సులో పాల్గొన్నారు. జీ20 నిర్వహిస్తోన్న తొలి అరబ్ దేశంగా సౌదీ రికార్డులకెక్కింది. ‘‘21వ శతాబ్దంలో అందరికీ సమాన అవకాశాలు'' అనే థీమ్ తో ఈ ఏడాది సదస్సు నిర్వహించారు.