చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మయన్మార్ సరిహద్దు వెంబడి రెండు వేల కిలోమీటర్ల పొడవున అతి పెద్ద ముళ్ళ తీగలతో నిర్మాణం చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అక్రమ చొరబాట్లను నివారించడానికి చైనా తన దక్షిణ సరిహద్దు మయన్మార్ వెంట 2000 కిలోమీటర్ల పొడవైన ముళ్ల తీగలతో గోడను నిర్మించే పనిలో ఉంది. నివేదికల ప్రకారం, మయన్మార్ సైన్యం తన సరిహద్దులో గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండగా, చైనా మాత్రం నిర్మాణంపై చాలా స్ట్రాంగ్ గా ఉంది. మయన్మార్ నుండి దేశంలోకి ప్రవేశిస్తున్న అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవటం తమ నిర్మాణ లక్ష్యమని చైనా ప్రకటించుకుంది. అయితే అంతర్జాతీయంగా మయన్మార్ సరిహద్దు వెంట చైనా చేపడుతున్న నిర్మాణంపై చర్చ జరుగుతుంది.
#IndiaChinaStandOff
#China
#SouthernborderofMyanmar
#IndianArmy
#Covid19Vaccine
#IndianRailways