Kisan Parade: Kisan Tractor Rally Updates
#KisanParade
#KisanTractorRallyLIVEUpdates
#Farmers
#RedFort
#NewDelhi
#RepublicDay2021Parade
#FarmersDharna
#KisanGantantraParade
గణతంత్ర దినోత్సవం వేళ.. దేశ రాజధానిలో రైతులు నిర్వహిస్తోన్న ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మక రూపుదాల్చింది. ఈ ఉదయం ఆరంభమైన అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పైగా కొత్త ప్రాంతాలకు విస్తరించడం ఆందోళనకు దారి తీస్తోంది. చారిత్రాత్మక ఎర్రకోటను ముట్టడించిన అనంతరం ఉద్రిక్తత మిన్నంటింది. ఇతర ప్రాంతాల నుంచి వేలాదిమంది రైతులు ఎర్రకోట వైపునకు దూసుకుని రావడానికి ప్రయత్నిస్తుండటంతో పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. రైతులు, పోలీసులు, ఇతర భద్రతాసిబ్బంది మధ్య కొనసాగుతోన్న దాడులు, లాఠీఛార్జీలతో ఢిల్లీ నిప్పుల కుంపటిలా మారింది. లాఠీఛార్జీలతో విరుచుకుని పడుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తాజాగా-నంగ్లోయ్ ప్రాంతంలో హింసాత్మక వాతావరణం నెలకొంది. టిక్రీ సరిహద్దుల నుంచి దేశ రాజధానిలోకి వందలాది ట్రాక్టర్లతో ప్రవేశించిన రైతులు ఎర్రకోట వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ముందుగా నిర్దేశించిన మార్గం గుండా కాకుండా..ఎర్రకోట వైపు కదలడం పట్ల పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నంగ్లోయ్ వద్ద ట్రాక్టర్ల ప్రదర్శనను అడ్డుకున్నారు. దీన్ని రైతులు ప్రతిఘటించడంతో లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది.