Telangana Congress Comments on Budget 2021
#Budget2021
#Telangana
#Hyderabad
#CentralGovernment
#Congress
కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశ పర్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. బడ్జెట్‌పై ఆయన స్పందించారు. తెలంగాణ గురించి బడ్జెట్‌లో ఒక్క మాట మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రై పోర్ట్ గురించి ప్రస్తావనే లేదన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా? బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.