After 24 years, the fee at Alipiri toll gate, entrance to Tirumala ghat road, has been increased. The Endowments Department issued an order on Friday, revising the Alipiri toll gate fee based on the recommendation of Tirumala Tirupati Devasthanams (TTD).
#Tirumala
#Andhrapradesh
#Tirupati
#Ttd
కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలను సందర్శించడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు కొత్తగా మోతబరువు పడింది. అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొద్దిసేపటి కిందటే నిర్ణయం తీసుకున్నారు. తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ అలిపిరి వద్ద ఉన్న ఈ టోల్‌గేట్ మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టోల్‌గేట్ వద్ద వసూలు చేస్తోన్న ఛార్జీలను టీటీడీ అధికారులు భారీగా పెంచారు.