Ind Vs Eng : Ben stokes comments on his performance on day 1.
#BenStokes
#Indvseng
#Indiavsengland
#ViratKohli
తాను ఇప్పటివరకు దాదాపుగా 70 టెస్ట్ మ్యాచులు ఆడానని, ఒక బ్యాట్స్‌మన్‌గా ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరిస్థితులు ఇవేనని ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తెలిపాడు. అహ్మదాబాద్ పిచ్‌పై కష్టతరమైన పరిస్థితుల్లో రెండున్నర గంటలు బ్యాటింగ్ చేశాక ఔటవ్వడం చిరాకు పెట్టిందన్నాడు. మూడో టెస్టు కన్నా మెరుగైన పిచ్‌పై భారీ స్కోరు చేయలేకపోవడం నిరాశ పరిచిందని స్టోక్స్ పేర్కొన్నాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టోక్స్ 121 బంతుల్లో 55 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.