5G network deployment can start in 3 months | Oneindia Telugu

Oneindia Telugu 2021-03-15

Views 56

5G network deployment can start in 3 months but infra not ready in India says Experts. 5G networks in India can be deployed in three months but in limited areas as the optical fibre based infrastructure to support the technology is not ready yet, telecom industry said.
#5GinIndia
#5GnetworksinIndia
#5GStartin3MonthsinIndia
#opticalfibreinfrastructure
#technology
#telecomindustry
#5Gservices
#AmitMarwah
#5జీ

4జీ ముగిసింది. 5జీ కోసం యువత కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. స్పీడ్ కోసం ఆత్రుతతో వెయిట్ చేస్తోంది. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే మౌలిక సదుపాయాలపరంగా సమస్యలు మాత్రం ఉన్నాయి. టెక్నాలజీకి కీలకమైన ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత ఇన్‌ఫ్రా ఇంకా సిద్ధంగా లేదు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే 5జీ నెట్‌వర్క్‌ను పరిమితం చేయాల్సి వస్తుందని టెలికం పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై భారత్‌ సత్వరం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే కొత్త తరం టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోలేకపోవచ్చని నోకియా ఇండియా హెడ్‌ అమిత్‌ మార్వా తెలిపారు. 5జీ అనేది ఆపరేటర్లు సొమ్ము చేసుకునే మరో మార్గంగా భావించొద్దు అని.. దేశానికి, ప్రపంచానికి ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రస్తుతం ఇది ఎంతో అవసరం అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS