CoWin, Aarogya Setu and Umang app will be open for vaccine registrations from 4 pm today for those above 18
#vaccineregistrationsabove18
#HospitalsCoronaHotspots
#WHO
#PMModi
#NewDelhi
#secondCovidwave
#oxygenconcentrators
#Umangapp
#CoWin
#AarogyaSetu
#coronavirusinindia
#Oxygencrisisinindia
మూడో విడత టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆరంభమౌతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హులు. తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేయించుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తారు. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఆయా చోట్ల నిర్దేశిత గడువులోగా టీకాల కార్యక్రమం ప్రారంభమౌతుందా? లేదా? అనేది అనుమానాలను రేకెత్తిస్తోంది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులైన ప్రతి ఒక్కరూ ముందుగా తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న http://cowin.gov.in వెబ్‌సైట్‌తో మరో రెండు సౌకర్యాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆరోగ్యసేతు, ఉమంగ్ యాప్‌ల ద్వారా కూడా అర్హులు తమ పేర్లు, ఇతర వివరాలను నమోదు చేయించుకునే వెసలుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.