Piyush Chawla, who was part of India’s 2011 World Cup-winning team, lost his father Pramod Kumar on Monday due to COVID-19 complications.And Jailed activist Natasha Narwal's father, senior CPIM leader Mahavir narwal Lost Life
#PiyushChawlaFather
#PramodKumarChawla
#activistNatashaNarwal
#CPIMleaderMahavirnarwal
#COVID19
#IPL2021
#MI
#COVIDVaccination
టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన అతని తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా కరోనా పోరాడిన పీయూష్ తండ్రి చివరకు మహమ్మారికి బలైయ్యారు. ఈ విషయాన్ని పీయూష్ చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. విషయం తెలుసుకున్న సహచర ఆటగాళ్లు, అభిమానులు ఈ కష్ట సమయంలో మనో ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. మహిళా విద్యార్థుల హక్కుల కార్యకర్త నటాషా నర్వాల్ తండ్రి మహవీర్ నర్వాల్ కరోనావైరస్‌తో మృతి చెందారు. గతేడాది మే నెలలో ఢిల్లీ అల్లర్ల కేసులో నటాషాను పోలీసులు అరెస్టు చేశారు. ఇక అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం తన తండ్రి మహవీర్ నర్వాల్ రోహతక్ హాస్పిటల్‌లో కోవిడ్‌కు చికిత్స పొందుతూ మరణించారు. తండ్రి మరణించారన్న వార్త తెలుసుకున్న నటాషా కన్నటీ పర్యంతమయ్యారు. ఇక తన సోదరుడు ఆకాష్ కూడా కోవిడ్‌తో చికిత్స పొందుతున్నాడు.