He never scored ODI century, Virat has 70 international tons': Salman Butt on Vaughan's Kohli-Williamson comparison
#ViratKohli
#MichaelVaughan
#Vaughan
#SalmanButt
#KaneWilliamson
#WTCFinal
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కవ చేస్తూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ గురించి వన్డే క్రికెట్‌లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయని మైకేల్ వాన్ మాట్లాడటం అర్హరహితమన్నాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌తో పోల్చుతూ మైకేల్ వాన్ సరికొత్త చర్చకు తెరలేపాడు. విలియమ్సన్ భారత్‌లో జన్మించి ఉంటే కోహ్లీని వెనక్కు నెట్టి వరల్డ్ బెస్ట్ క్రికెటర్‌గా నిలిచేవాడన్నాడు. ఇక్కడ విలియమ్సన్ కన్నా విరాట్ కోహ్లీ తక్కువా అనే ఉద్దశేంతో ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన సల్మాన్ బట్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌పై మండిపడ్డాడు.