Bigg Boss Malayalam 3: It has been reported that the Malayalam Bigg Boss show at the Chennai EVP shooting site will be stopped due to the Covid positive for members.
#BiggBossMalayalam3
#BigbossMalayalamseason3covidPositive
#MalayalamBiggBossshow
#Mohanlal
#COVIDVaccination
#BiggBossmemberscovidPositive
#televisionshow
బిగ్‌బాస్ మలయాళం రియాలిటీ షోకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. సూపర్‌స్టార్ మోహన్ లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 3వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. బిగ్‌బాస్ మలయాళం ఇంటిలో కరోనా విజృంభించడంతో నిర్వాహకులు నిలిపివేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఈ షోను ఎందుకు నిలిపివేశారనే విషయంలోకి వెళితే..తమిళనాడులో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్నది. ప్రస్తుతం బిగ్‌బాస్ మలయాళం సీజన్ 4 ఇంటి సెట్‌ను చెన్నై పరిసర ప్రాంతంలోని ఈవీపీ గార్డెన్‌లో వేశారు. తాజాగా షో అక్కడి నుంచి ప్రసారం అవుతున్నది. అయితే బిగ్‌బాస్ ఇంటిలో కరోనా కలకలం రేపడం నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది.