గుజరాత్‌లో తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ తీవ్రతను అంచనా వేశారు. ఈ ఉదయం దేశ రాజధాని నుంచి ప్రత్యేక విమానంలో ఆయన గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చేరుకున్నారు. అనంతరం భావ్‌నగర్ విమానాశ్రయం నుంచి ఏరియల్ సర్వేకు బయలుదేరారు. తీర ప్రాంత జిల్లాలైన అమ్రెలి, భావ్‌నగర్, కేంద్రపాలిత ప్రాంతం డయ్యుల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. గిర్ సోమ్‌నాథ్, ఉనా, జఫరాబాద్‌లల్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే కొనసాగింది. అనంతరం ఆయన అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
#CycloneTauktae
#PMModi
#Gujarat
#PMModiAerialSurvey
#Cyclone
#PMModiAerialSurvey
#NarendraModi
#HeavyRains
#Weather