Sushil Kumar and Ajay Bakkarwala were arrested by Delhi Police on Sunday morning.
#SushilKumar
#Delhi
యువ రెజ్లర్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారత్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రతిష్ట వేగంగా మసకబారుతోంది. అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. నార్నర్త్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్ అయిన సుశీల్ ఐదేళ్లుగా ఛత్రశాల్ స్టేడియంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కొనసాగుతున్నాడు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి కేసుకు సంబంధించిన నివేదిక ఆదివారమే రైల్వే బోర్డుకు అందిందని, అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదవ్వడంతో సుశీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నామని ఉత్తర రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ ప్రముఖ వార్త సంస్థ పీటీఐకి తెలిపారు