Pat Cummins praises Cheteshwar Pujara’s Brisbane heroic innings
#Pujara
#Rishabhpant
#Teamindia
#PatCummins
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయావాల్ చతేశ్వర్ పుజారాపై ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో పటిష్టమైన ఓ రాతిగోడ అని, క్లాస్ ఆటగాడని కొనియాడాడు. క్రీజులో అతను చూపించే ఓపికకు ఎవరైనా దండం పెట్టాల్సిందేనన్నాడు. ఒక్క ముక్క మాట్లాడకున్నా పుజారా గురించి తనకెంతో తెలిసినట్టు అనిపిస్తుందని పేర్కొన్నాడు. గబ్బా టెస్టులో అతను మొక్కవోని ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడని, ఒక ఎండ్‌లో పుజారా, మరో ఎండ్‌లో పంత్‌ను చూడటం విచిత్రంగా అనిపించిందని వెల్లడించాడు. తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన ప్యాట్ కమిన్స్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు